SAMSUNG GALAXY M31S

SAMSUNG GALAXY M31S: సాంసంగ్ M సిరీస్ ను తక్కువ ప్రైస్ తో మంచి స్పెసిఫికేషన్ల తో తీసుకు వస్తుంది. దీనిలో తమ తరువాతి సిరీస్ ను ఇండియాలో SAMSUNG GALAXY M31S మొబైల్ తో లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమొలెడ్ డిస్ప్లే తో ఇన్ఫినిటీ ఓ ను కలిగి ఉంది. దీనిలో వాడిన ప్రాసెసర్ సాంసంగ్ EXYNOS 9611 తో తీసుకువచ్చారు. దీని వెనుక భాగంలో 64MP మెయిన్ కెమెరా,12MP వైడ్ యాంగిల్, 5 MP మాక్రో & 5 MP డెప్త్ కెమెరా కలిగి ఉంది.అలాగే ముందు భాగంలో 32 MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. 6000 mah బ్యాటరీ అలాగే 25w ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో తీసుకువచ్చారు. దీనిలో కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ తో మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కలిగి ఉంది. దీనిలో 6 జీబి రామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను 19,499/- ధరలో లాంచ్ చేశారు. అలాగే 8జి బి రామ్ మరియు 128 జీ బి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను 21,499/- ధరలో లాంచ్ చేశారు.